Share News

మోదీపై వ్యాఖ్యలకు ఖర్గే క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:46 AM

ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాలపై విమర్శలు సహజమని, కానీ దేశ ప్రధాని కుటుంబంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.

మోదీపై వ్యాఖ్యలకు ఖర్గే క్షమాపణ చెప్పాలి
BJP MP Laxman

  • ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు తగవు: ఎంపీ లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానాలపై విమర్శలు సహజమని, కానీ దేశ ప్రధాని కుటుంబంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ఖర్గే తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమవారం, తన నివాసంలో ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు తమ ప్రసంగాల్లో గౌరవం, సంయమనం పాటించాలని హితవు పలికారు.


వరుస ఎన్నికల్లో ఓటమి పాలై.. ప్రజలు మోదీకి వరుసగా మూడోసారి అధికారం అప్పగించడంతో వచ్చిన రాజకీయ నైరాశ్యంతోనే కాంగ్రెస్‌ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మోదీ నాయకత్వంలోని అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను వాస్తవాలతో ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఊరూరా తిరిగే రాహుల్‌ గాంధీ.. ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధాని అయితే ఎందుకు సహించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎండిన పైరుకు నిప్పు!

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:46 AM