భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదాలు..
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:09 AM
భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నప్పటికీ అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవటంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నప్పటికీ అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవటంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఇటీవల భద్రాచలం వద్ద గోదావరి నదిలో పడి మృత్యువాత పడ్డారు.
ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలో సరైన రక్షణ చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలంటూ జస్టిస్ నగేశ్ భీమపాక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దీనిని సుమోటోగా విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదలశాఖ, మునిసిపల్, తెలంగాణ టూరిజం డెవల్‌మెంట్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులకు నోటీసులు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News