Share News

తెలంగాణలో 358 మండలాల్లో కరవు.. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Oct 23 , 2026 | 09:29 PM

రాష్ట్రంలో అక్టోబర్ 31వ తేదీ లోగా కరవు మండలాల ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎల్‌నినో, కరవు పరిస్థితులపై చర్చించారు.

తెలంగాణలో 358 మండలాల్లో కరవు.. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి: భట్టి విక్రమార్క
batti vikramarka on drought in telangana

హైదరాబాద్, అక్టోబర్ 23: ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరవు పరిస్థితులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడారు.


‘రాష్ట్రంలో ప్రాథమికంగా 358 మండలాల్లో కరవు పరిస్థితులను గుర్తించాం. 324 మండలాల్లో ఆందోళనకర స్థాయిలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. రాష్ట్ర రిజర్వాయర్లలో 470 టీఎంసీలకు గాను ప్రస్తుతం 170 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు వద్దు.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. తాగునీరు, సాగునీటి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాం. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రతి వారం కరవు పరిస్థితులపై సమీక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే ప్రతీ జిల్లా కలెక్టర్‌కు రూ. కోటి చొప్పున అత్యవసర నిధులను విడుదల చేశాం’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

వన్డేల్లో జో రూట్ అరుదైన రికార్డు.. ఇంగ్లాండ్ తరఫున తొలి బ్యాటర్ గా..

చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. గిల్ రికార్డు బ్రేక్

Updated Date - Oct 23 , 2026 | 10:01 PM