చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. గిల్ రికార్డు బ్రేక్
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:01 AM
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్(114 బంతుల్లో 202) డబుల్ సెంచరీ చేశాడు. దీంతో పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా బ్రూక్ అరుదైన ఘనత సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్(114 బంతుల్లో 202) డబుల్ సెంచరీ చేశాడు. దీంతో పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా బ్రూక్ అరుదైన ఘనత సాధించాడు. అలానే వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఈ డబుల్ సెంచరీతో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరిట ఉన్న ఓ రికార్డును కూడా బ్రూక్ బద్దలు కొట్టాడు. గతంలో అత్యంత వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గిల్ తొలిస్థానంలో ఉన్నాడు. గత నెల గౌహతిలో వెస్టిండీస్‌పై గిల్ 116 బంతుల్లో ద్విశతకం సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 114 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత రెండు బంతులకే భారీ షాట్‌కు యత్నించి 202 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. మైదానంలో నలువైపులా అద్భుతమైన షాట్లు ఆడిన బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో 10 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు బాదాడు. అతడితో పాటు విల్ జాక్స్(66), జో రూట్(69), టామ్ బాంటన్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
కెప్టెన్ హ్యారీ బ్రూక్ వీరవిహారం చేయడంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. హ్యారీ బ్రూక్ వీరవిహారం చేయడంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయినప్పటికి ఇంగ్లండ్ ఓడిపోవడంతో బ్రూక్ ద్విశతకం వృథా అయిపోయింది. శ్రీలంక యువ ఆటగాడు పవన్ రత్నాయకే(106 బంతుల్లో 130) సెంచరీతో విజృంభించడంతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
వన్డేలలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ:
114 బంతులు - హ్యారీ బ్రూక్ vs శ్రీలంక
117 బంతులు - శుభ్‌మన్ గిల్ vs వెస్టిండీస్
126 బంతులు - ఇషాన్ కిషన్ vs బంగ్లాదేశ్
128 బంతులు - గ్లెన్ మాక్స్‌వెల్ vs ఆఫ్ఘానిస్థాన్
136 బంతులు - నిస్సంక vs ఆఫ్ఘానిస్థాన్
138 బంతులు - క్రిస్ గేల్ vs జింబాబ్వే
140 బంతులు - వీరేంద్ర సెహ్వాగ్ vs వెస్టిండీస్
ఇవి కూడా చదవండి:
నవంబరు మొదట్లో ‘ఇండీ’ మలి నిరసనలు
మిమ్మల్ని ప్రశ్నిస్తే.. విదేశీ ఏజెంట్ అంటారా: అన్నామలై
సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు: నేహా బోరా