Share News

మిమ్మల్ని ప్రశ్నిస్తే.. విదేశీ ఏజెంట్‌ అంటారా: అన్నామలై

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:21 AM

సీజేపీ నిరసనలను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన చర్యలను తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుబట్టారు.

మిమ్మల్ని ప్రశ్నిస్తే.. విదేశీ ఏజెంట్‌ అంటారా: అన్నామలై

చెన్నై, అక్టోబరు 22: సీజేపీ నిరసనలను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన చర్యలను తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుబట్టారు. ‘మిమ్మల్ని ప్రశ్నించేవారిపై విదేశీ ఏజెంట్‌ అనే ముద్ర వేస్తారా!’ అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్‌’లో ఆయన ఒక పోస్టును ఉంచారు. దేశ వ్యతిరేక శక్తుల పేరిట అణచివేసే బదులు సీజేపీ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని సూచించారు. సీజేపీ ఆందోళనల తీరును తాను సమర్థించనని, అయితే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Oct 23 , 2026 | 04:24 AM