Share News

దోమల నివారణకు వేసిన పొగతో చెలరేగిన మంటలు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 07:12 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన సేవా సంఘం కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దోమల నివారణ కోసం వేసిన పొగ వద్ద చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించాయి.

దోమల నివారణకు వేసిన పొగతో చెలరేగిన మంటలు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Kukatpally Fire Accident

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన సేవా సంఘం కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దోమల నివారణ కోసం వేసిన పొగ వద్ద చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. దీంతో పలువురు నివసిస్తున్న గుడిసెలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న కట్టెల దుకాణం కూడా పూర్తిగా దగ్ధమైంది.


స్థానికుల వివరాల ప్రకారం.. దోమల నివారణ కోసం పొగ వేస్తుండగా అక్కడ చెలరేగిన మంటలు సమీపంలోని గుడిసెలకు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అనంతరం మంటలు పక్కనే ఉన్న కట్టెల దుకాణానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో గుడిసెలతో పాటు కట్టెల దుకాణం దగ్ధం కావడంతో ఆస్తి నష్టం సంభవించింది.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్‌ ఎల్‌నినో వచ్చినా విద్యుత్‌ కొరత రావొద్దు

బస్సులపై నిరంతర పర్యవేక్షణ

Updated Date - Oct 23 , 2026 | 07:16 AM