Share News

నవంబరు మొదట్లో ‘ఇండీ’ మలి నిరసనలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:25 AM

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా తదుపరి దఫా దేశవ్యాప్త నిరసనలకు విపక్ష ఇండీ కూటమి సమాయత్తమవుతోంది. దసరాను పురస్కరించుకుని నిలిపివేసిన ఆందోళనలను..

నవంబరు మొదట్లో ‘ఇండీ’ మలి నిరసనలు

న్యూఢిల్లీ, అక్టోబరు 22: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా తదుపరి దఫా దేశవ్యాప్త నిరసనలకు విపక్ష ఇండీ కూటమి సమాయత్తమవుతోంది. దసరాను పురస్కరించుకుని నిలిపివేసిన ఆందోళనలను.. నవంబరు మొదట్లో మళ్లీ చేపట్టాలని భావిస్తోంది. వాటికి ముందు నవంబరు 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహించనుంది. మలి నిరసనలు ఎలా నిర్వహించాలన్నదానిపై ప్రతిపక్ష నేతలు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. ఢిల్లీ నడిబొడ్డున ఇటీవల జరిపిన ధర్నాలు రాజకీయంగా విజయవంతమయ్యాయని.. ఇలాంటి భారీ నిరసనలు మళ్లీ చేపట్టాలని కొందరు నేతలు అంటున్నారని.. పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ వెల్లడించారు.

Updated Date - Oct 23 , 2026 | 04:28 AM