Share News

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు: నేహా బోరా

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:17 AM

ఢిల్లీలోని కానట్‌ ప్లేస్‌ సెంట్రల్‌ పార్కులో జాతీయ జెండా ఆవిష్కరణకు సీజేపీ ఇచ్చిన పిలుపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నేహా బోరా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు: నేహా బోరా

న్యూఢిల్లీ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని కానట్‌ ప్లేస్‌ సెంట్రల్‌ పార్కులో జాతీయ జెండా ఆవిష్కరణకు సీజేపీ ఇచ్చిన పిలుపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నేహా బోరా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. అలాగే ప్రభుత్వ మార్పును కోరడంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ నోటీసును సవాల్‌ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. నేహా బోరా తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వాదనలు వినిపించారు. నేహా బోరా ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 04:20 AM