Share News

టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు తగులబెట్టిన దుండగులు..

ABN , Publish Date - Oct 23 , 2026 | 07:33 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలం కురవపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్‌కు చెందిన కారును తగులబెట్టారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నాలుగు పెట్రోల్ క్యాన్లతో వచ్చిన దుండగులు కారుకు నిప్పంటించారు.

టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్ కారు తగులబెట్టిన దుండగులు..
Chandragiri News

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలం కురవపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. టీడీపీ సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్‌కు చెందిన కారును తగులబెట్టారు. గురువారం అర్ధరాత్రి సమయంలో నాలుగు పెట్రోల్ క్యాన్లతో వచ్చిన దుండగులు కారుకు నిప్పంటించారు. సీసీ కెమెరాలను పక్కకు తిప్పి మరీ ఈ దారుణానికి తెగబడ్డారు.


గతంలో మాజీ చైర్మన్ సహదేవ రెడ్డి అవినీతిని వెలుగులోకి తెచ్చినందుకే ఈ దాడి జరిగి ఉంటుందని ముట్టమ్ ప్రభాకర్ ఆరోపించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తన కారును దగ్ధం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల నామినేషన్ల సమయంలో భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి

జడ్పీటీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బత్తుల భార్య

పులివెందుల డీఎస్పీని తప్పించండి

Updated Date - Oct 23 , 2026 | 07:38 AM