Share News

జడ్పీటీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బత్తుల భార్య

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:21 AM

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. సీతానగరం జడ్పీటీసీ స్థానానికి ఆమె గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

జడ్పీటీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బత్తుల భార్య

  • ‘తూర్పు’ తొలి జడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యే అవకాశం

రాజమహేంద్రవరం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కూటమి సీట్ల పంపకాల్లో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన నాయకురాలిగా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ, క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆమెకు సీతానగరం మండలంలో మంచి పట్టుంది. జిల్లాలో మొత్తం 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 14 చోట్ల టీడీపీ, ఏడు చోట్ల జనసేన పోటీ చేస్తున్నాయి. తూర్పు జడ్పీ స్థానం జనరల్‌కి కేటాయించారు. పొత్తుల్లో భాగంగా జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి జనసేనకు కేటాయిస్తే జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా వెంకటలక్ష్మీకి అవకాశం దక్కవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 06:21 AM