Share News

బీజేపీ అంటే రేవంత్‌ రెడ్డికి భయం

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:03 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, బీజేపీని ఎదుర్కొనే ధైర్యం ఆ రెండు పార్టీలకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ అంటే రేవంత్‌ రెడ్డికి భయం

  • మా పార్టీని తట్టుకునే దమ్ము కాంగ్రెస్‌కు లేదు

  • ‘సర్‌’ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులే

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ అంటే సీఎం రేవంత్‌ రెడ్డి భయపడుతున్నారు. బీజేపీని తట్టుకునే దమ్ము కాంగ్రెస్‌కు లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. ఆ రెండు పార్టీలకు బీజేపీ అంటే భయం. బీజేపీని అడ్డుకోవాలని అవి కుట్రలు చేస్తున్నాయి. ఈసారి తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తథ్యమ’ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీ పోటీయే కాదని, బీఆర్‌ఎస్‌తోనే తమకు పోటీ అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.


ఆదివారం కరీంనగర్‌లోని గురుద్వార్‌లో ఎంపీ లాడ్స్‌ నిధులతో నిర్మించిన 11 కేవీ సోలార్‌ ప్యానెల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులేనని మండిపడ్డారు. ‘సర్‌’ పేరుతో రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ దేశ ప్రతిష్టకు కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. అందుకే ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం-అరాచకాన్ని అంతం చేద్దాం’ పేరిట దేశవ్యాప్తంగా బీజేపీ మహా పాదయాత్రలు నిర్వహిస్తోందని చెప్పారు. వీటిలో కరీంనగర్‌ మహా పాదయాత్ర హైలైట్‌గా నిలుస్తుందని, చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గుండెల్లో వణుకు పుట్టేలా విజయవంతం కాబోతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 04:03 AM