విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ కుట్రలు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:35 AM
విదేశీ శక్తులతో కలిసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు.
సర్ ప్రక్రియ సహేతుకమని సుప్రీం కోర్టు చెప్పింది
అరాచక శక్తుల కుట్రలను ప్రజలకు వివరిస్తాం: సంజయ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం: అర్వింద్
కరీంనగర్/జగిత్యాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): విదేశీ శక్తులతో కలిసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారంకరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. విదేశీ శక్తులు, విదేశీ ఆర్థిక సాయంతో పెట్టిన బొద్దింక పార్టీ వాళ్లతో, నేహా బోరా వంటి అరాచక శక్తులతో కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తోందన్నారు. అరాచక శక్తుల కుట్రలను ప్రజలకు వివరిచేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్‌లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్ ప్రక్రియ సహేతుకమని స్వయంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్రకు సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు జన సమీకరణ చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 5న కరీంనగర్‌లో నిర్వహించే మహాపాద యాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొంటారని చెప్పారు. మహాపాదయాత్రకు 50 వేల మంది వచ్చేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని చెప్పారు. అమృత్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ జగిత్యాలలో పనులు ప్రారంభించలేదన్నారు. హైదరాబాద్‌లో సోమవారం తలపెట్టిన అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News