Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ తలపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:32 PM

హైదరాబాద్‌లోని బడంగ్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు నాదర్‌గుల్ గ్రామానికి చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మిగా గుర్తించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ తలపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్
Road Accident

హైదరాబాద్, సెప్టెంబర్ 29: నగరంలోని బడంగ్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు నాదర్‌గుల్ గ్రామానికి చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మిగా గుర్తించారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ గృహకల్పకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రసన్నలక్ష్మి అనే మహిళ స్కూటీపై వెళ్తుండగా.. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను చూసి సడన్ బ్రేక్ వేసింది. దీంతో అదుపుతప్పి ఆమె స్కూటీపై నుంచి కిందపడిపోయింది.


అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిలోనే ప్రసన్నలక్ష్మి ప్రాణాలుకోల్పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

ఎర్రవల్లిలో అధికారుల సర్వే పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 12:44 PM