నాలుగేళ్లుగా మైనార్టీ స్కాలర్‌షిప్‌ల నిలిపివేత
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:12 AM
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగేళ్లుగా ముస్లిం విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్ పథకాలను నిలిపివేసిందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
కేంద్ర విధానాలతోనే పెరుగుతున్న డ్రాపవుట్లు: అసదుద్దీన్
హైదరాబాద్, నవంబరు5(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగేళ్లుగా ముస్లిం విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్ పథకాలను నిలిపివేసిందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మజ్లిస్ చారిటీ తరపున గత 21 ఏళ్లుగా రూ.10.50కోట్ల విలువైన సహాయం చేశామని, ఈ ఏడాది రూ.86లక్షలను విద్యార్థులకు సహాయం రూపంలో అందించామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ముస్లిం విద్యార్థుల డ్రాపవుట్లు పెరుగుతున్నాయని, యూడైస్ లెక్కల ప్రకారం ప్రాథమిక స్థాయిలో 8 శాతంగా ఉన్న డ్రాపవుట్ల సంఖ్య, మాధ్యమిక స్థాయిలో 6, ఉన్నత విద్యలో 4 శాతంగా ఉందన్నారు. కాగా, ఉర్దూ మాధ్యమంలో పదో తరగతి చదువుతున్న 1700 మంది విద్యార్థుల పరీక్ష ఫీజును మజ్లిస్ చారిటీ తరపున ఆయన చెల్లించారు. గురువారం దారుసలాంలో ఫీజుల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుల చేతికి అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News