తరుముకొస్తున్న తుఫాను
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:39 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
28న పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్, విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి తూర్పు ఆగ్నేయంగా విశాఖకు 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయానికి నైరుతి దిశలో పయనించే క్రమంలో తుఫాన్‌గా మారనుంది. దీనికి ‘ఆర్నబ్’ అని పేరు పెట్టారు. ఈనెల 27న ఉదయానికిపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే సమయానికి తీవ్ర తుఫాన్‌గా, సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా బలపడనున్నది. 28వ తేదీ ఉదయం విశాఖపట్నం- మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది.
దీని ప్రభావంతో ఈనెల 28 నుంచితెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, భూపాలపల్లి, యాదాద్రి భువనగరి, జనగామ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని.. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు 14 - 16 డిగ్రీలకు పడిపోవచ్చని వెల్లడించారు. మరోవైపు ఆర్నబ్ తుఫాను కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘తుమ్మిడిహెట్టి’కి ఎలాగైనా ఒప్పిద్దాం
Read Latest AP News And Telangana News And International News And Telugu News