Share News

141 మందికి అపోలో వైద్య పట్టాల ప్రదానం

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:22 AM

జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శనివారం అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ స్నాతకోత్సం వైభవంగా జరిగింది.

141 మందికి అపోలో వైద్య పట్టాల ప్రదానం
Apollo Gold Medal Winners

  • ఘనంగా అపోలో మెడికల్‌ కాలేజీ స్నాతకోత్సవం

  • 97 మందికి ఎంబీబీఎస్‌, 44 మందికి పీజీ డిగ్రీలు

  • ప్రతిభావంతులైన విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ అందజేత

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శనివారం అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ స్నాతకోత్సం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కార్డియాలజిస్ట్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ బి.సోమరాజు.. 2020బ్యాచ్‌కు చెందిన 97మంది ఎంబీబీఎస్‌, 2022 బ్యాచ్‌కు చెందిన 44మంది ఎండీ/ఎంఎస్‌ విద్యార్థులకు వైద్య పట్టాలు ప్రదానం చేశారు.


ఉత్తమ యూజీ విద్యార్థినిగా కొచ్చెర్లకోట మాయాదేవి, ఉత్తమ పీజీ విద్యార్థినిగా జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి చెం దిన డాక్టర్‌ సముద్రాల కావ్య.. డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి బంగారు పతకా లు అందుకున్నారు. డాక్టర్‌ కేవీఆర్‌ ప్రసాద్‌ స్మారక బంగారు పతకం వెల్లురి శర్వాణి శ్రీరమ్యకు దక్కింది. కార్యక్రమంలో డీన్‌ డాక్టర్‌ కె.మనోహర్‌, సీవోవో అపర్ణారెడ్డి పాల్గొన్నారు. 2012లో కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి 700మందికి పైగా పట్టభద్రులయ్యారని నిర్వాహకులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కూనంనేని

రేడియల్‌ రోడ్‌-2 టెండర్లలో భారీ అక్రమాలు: కేటీఆర్‌

ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 06:22 AM