Share News

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కూనంనేని

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:18 AM

అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, గద్దె దిగేందుకు మోదీ రోజులు లెక్క పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కూనంనేని
Kunamneni Sambasiva Rao

హైదరాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, గద్దె దిగేందుకు మోదీ రోజులు లెక్క పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. తక్షణమే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన యువకులను విడుదల చేయాలని, జంతర్‌ మంతర్‌ నుంచి పారామిలటరీని ఉపసంహరించుకొని నిరసనకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల నిర్బంధాలను ఛేదించుకొని రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వెళ్లిన యువతీ యువకులందరూ అభినవ భగత్‌సింగ్‌లని అభివర్ణించారు.


ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన సీజేపీ అధ్యక్షుడు అభిజిత్‌ దీప్కే, తదితరులను విమానం నుంచే ఎత్తుకెళ్లడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బ్యాంకులను లూటీ చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక ఉగ్రవాదులను పట్టుకోలేని ప్రభుత్వం యువతపై ప్రతాపం చూపడమేమిటని ప్రశ్నించారు. కాగా, శుక్రవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం సాధించడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాష్ట్రపతితో భేటీ తర్వాతా.. రాహుల్‌ పచ్చి అబద్ధాలు చెప్పారు

రేడియల్‌ రోడ్‌-2 టెండర్లలో భారీ అక్రమాలు: కేటీఆర్‌

ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 06:18 AM