అపోలో హాస్పిటల్స్‌కు భారీ ఊరట.. ఫెమా కేసు క్లోజ్ చేసిన ఈడీ
ABN , Publish Date - Jun 17 , 2026 | 09:36 PM
అపోలో హాస్పిటల్స్‌కు భారీ ఊరట లభించింది. ఈ ఆస్పత్రులపై ఉన్న ఫెమా ఉల్లంఘనల కేసును ఈడీ క్లోజ్ చేసింది. దీంతో ఆర్బీఐ కాంపౌండింగ్ ప్రక్రియ ముగిసింది.
న్యూఢిల్లీ, జూన్17: అపోలో హాస్పిటల్స్‌కు భారీ ఊరట లభించింది. ఈ ఆస్పత్రులపై ఉన్న ఫెమా(FEMA) ఉల్లంఘనల కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) క్లోజ్ చేసింది. దీంతో అపోలోపై ఫెమా చర్యలను ఈడీ నిలిపివేయడంతో.. ఆర్బీఐ కాంపౌండింగ్ ప్రక్రియ ముగిసింది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ(RBI) జరిమానాను సెటిల్ చేయడంతో.. ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెమా చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం ఆర్బీఐ ఈ వివాదాన్ని పరిష్కరించడంతో అపోలో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
ఈ కేసులో అపోలో హాస్పిటల్స్‌పై నాలుగు రకాల ఫెమా ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. వీటి విలువ రూ.2,424 కోట్లకుపైగా ఉందని ఈడీ పేర్కొంది. ప్రభత్వ అనుమతి లేకుండా నిషేధిత రంగంలో ఎఫ్‌డీఐలు స్వీకరించడం, ఫెమా నిబంధనలకు విరుద్దంగా విదేశీ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్లు జారీ చేయడం, విదేశీ పెట్టుబడుల పరిమితులను మించడంతోపాటు అనుమతించిన విదేశీ వాటా పరిమితిని అధిగమించడం వంటి అంశాలు ఉన్నాయి.
వీటిపై విచారణ కొనసాగుతున్న సమయంలో అపోలో హాస్పిటల్స్.. ఫెమా చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించి.. కాంపౌండింగ్‌కు దరఖాస్తు చేసింది. దీనిపై ఈడీ నుంచి ఎన్‌ఓసీ కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించింది. దీంతో ఆర్బీఐ కాంపౌండింగ్ ఆర్డర్ జారీ చేసింది. అనంతరం అపోలో హాస్పిటల్స్‌పై ఫెమా కేసును క్లోజ్ చేసింది ఈడీ.
ఇవీ చదవండి:
రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్
లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నడిపితే కఠిన చర్యలు: అడిషనల్ డీజీ
For TG News And Telugu News