Share News

రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్

ABN , Publish Date - Jun 17 , 2026 | 07:39 PM

రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా నిధులు అందిస్తుంది. 23వ పీఎం కిసాన్ యోజన నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్
PM Kisan Yojana

న్యూఢిల్లీ, జూన్ 17: రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా నిధులు అందిస్తుంది. 23వ పీఎం కిసాన్ యోజన నిధుల విడుదలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. పశ్చిమ బెంగాల్‌ హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దాంతో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున నగదు జమ కానుంది. ప్రతి ఏటా మూడు దఫాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.


ఈ పథకం ద్వారా ఏడాదికి మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాలో నగదు జమ అవుతాయి. అవి మూడు దఫాలుగా.. నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ఈ నగదు కేంద్రం వేస్తోంది. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 13వ తేదీన 22వ విడత నగదును అసోంలోని గౌహతి‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విదితమే.


ఇవీ చదవండి:

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

'బాస్' పేరిట వాట్సాప్ మోసం.. రూ.10.4 కోట్లకు పైగా బురిడీ

Updated Date - Jun 17 , 2026 | 09:06 PM