Home » Apollo Hospital
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు.
అపోలో హాస్పిటల్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్ల పెట్టుబడులతో 4,300 కొత్త పడకలను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. క్యూ4 లో రూ.390 కోట్లు నికర లాభం నమోదు చేసిన ఈ సంస్థ, ఏడాది మొత్తానికి రూ.1,446 కోట్ల లాభాన్ని సాధించింది.
ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ మార్చి 31, 2025తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (Q4 FY25) పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రులు దేశంలో పెరుగుతున్న రక్తపోటు సమస్యపై దృష్టి సారించాయి. దాదాపు 30 శాతం మంది భారతీయ వయోజనులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి.
రోగుల పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న నర్సులను అపోలో హాస్పిటల్స్ గౌరవించింది. వారి సేవలు ఎంతో విలువైనవని ప్రశంసించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.
అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి అపోలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదంలో గాయపడి, తీవ్రమైన భుజం నొప్పితో బల హీనంగా మారిన వ్యక్తి ఎడమ చెయ్యికి అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీని నిర్వహించారు.
హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 పేరిట అపోలో హాస్పిటల్స్ 5వ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు ఇందులో వెల్లడయ్యాయి.
హురున్ 2025 కుబేరుల జాబితాలో భారతదేశం నుంచి 284 మంది చోటు సంపాదించగా, ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉండగా, అత్యంత సంపన్న భారత మహిళగా రోష్నీ నాడార్ నిలిచారు. జాబితాలో 21 మంది తెలుగువారుకూ స్థానం లభించడంతో వారి మొత్తం సంపద రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది
జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి, పక్షవాత బాధితులకు అందిస్తున్న సేవలను గుర్తించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) కాంప్రెహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సీఎస్‌సీ) సర్టిఫికెట్‌ను అందించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ పొందిన మొదటి ఆస్పత్రిగా అపోలో నిలిచింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాతృమూర్తి దయాళ్ అమ్మాళ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.