తెలంగాణలో అమిత్‌షా పర్యటన రేపే
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:02 AM
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. నవంబరు 2న మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న అమిత్‌షా.. అక్కడ నుంచి కాకతీయ హోటల్‌కు వెళతారు.
జగ్జీవన్ విగ్రహం నుంచి మహా పాదయాత్ర..
ఎంజే మార్కెట్ వద్ద కార్నర్ మీటింగ్..
ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్/ బర్కత్‌పురా/ బంజారాహిల్స్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. నవంబరు 2న మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న అమిత్‌షా.. అక్కడ నుంచి కాకతీయ హోటల్‌కు వెళతారు. సాయంత్రం 4 గంటలకు ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచక వాదాన్ని అంతం చేద్దాం (లోక్‌తంత్రా బచావో.. అరాచకత హటావో)’ పేరుతో నిర్వహించే బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ చౌరస్తా వరకూ మహా పాదయాత్రలో పాల్గొంటారు. 5 నుంచి 5.30 గంటల వరకూ ఎంజే మార్కెట్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ఆరు గంటలకు ఢిల్లీ బయలు దేరి వెళతారు. మధ్యాహ్నం 2-4 గంటల మధ్య గల రిజర్వు సమయంలో రాష్ట్ర ప్రముఖులతో అమిత్‌షా భేటీ అవుతారని సమాచారం.
కాగా, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద మహా పాదయాత్ర ఏర్పాట్లను శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అటుపై బర్కత్‌పురాలోని బీజేపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, ఖైరతాబాద్‌లోని సాగర్ సొసైటీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. సర్ (ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్ అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News