గచ్చిబౌలిలో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:37 AM
గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్‌లో శుక్రవారం ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
రాయదుర్గం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్‌లో శుక్రవారం ఓ అమెరికా పౌరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడిని కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41)గా పోలీసులు గుర్తించారు. వ్యాపార పనుల నిమిత్తం తన వ్యాపార భాగస్వామి డేవిడ్ వూతో కలిసి నవంబర్ 2న హైదరాబాద్‌కు వచ్చిన అతడు.. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో గదిని తీసుకున్నాడు.
ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది నవంబర్ 5న సాయంత్రం గది తలుపులు తెరిచి చూడగా.. మంచంపై అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వారు వెంటనే పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వైద్యులు పరీక్షించి మిచెల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News