సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:19 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్, జులై 6: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అల్లుఅర్జున్ ముంబై షూటింగ్‌లో ఉండడంతో వర్చువల్‌గా హాజరయ్యేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో నిందితులు కొంతమంది వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరుకాలేదు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల(జులై) 29కి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులకు సంబంధించి 500 పేజీల ఛార్జ్‌షీట్ కాపీలను కోర్టుకు పీపీ అందజేశారు.
ఈ కేసుకు సంబంధించి గత విచారణలోనూ అల్లుఅర్జున్ వర్చువల్‌గా అటెండ్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణకు సంబంధించి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే అర్జున్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారని, ముంబైలో ఉన్నందుకు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు కోర్టు అనుమతించింది.
ఇవి కూడా చదవండి...
ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ
రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరు వాడుకున్నారు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News