Share News

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:58 PM

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
AP IPS Officers Transfer

అమరావతి, జులై 6: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పలు జిల్లాలకు ఓఎస్డీలను, అదనపు ఎస్పీలను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు(సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా మార్కాపూర్ జిల్లా ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్)గా నవ్ జ్యోతి మిశ్రాను నియమించారు. తూర్పుగోదావరి (రాజమండ్రి) అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్ మనీష్‌ను బదిలీ చేశారు. అలాగే మండా జావలి అల్ఫోన్స్‌ను పోలవరం జిల్లా ఓఎస్డీగా నియమించారు.


అమరావతి ఓఎస్డీ లా అండ్ ఆర్డర్‌గా మనోజ్ రామనాధ్ హెగ్డేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రోహిత్ కుమార్ చౌదరికి పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా (ఏఎస్పీ) సుస్మితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


ఇవి కూడా చదవండి...

ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా: సీఎం చంద్రబాబు

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 01:34 PM