Share News

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:33 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.

పేర్నినానిలా నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు: మంత్రి సత్యకుమార్
Satya Kumar Yadav

అనంతపురం, జులై 6: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తి పేర్ని నాని అని వ్యాఖ్యానించారు. ‘నేను పార్టీలు మారే అవకాశవాదిని కాదు.. నాని అవకాశం కోసం పార్టీలు మారుతారు. నా రక్తంలోనే కషాయం ఉంది. ఒక మంత్రిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోను. జగన్‌ను నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదు.. ఆయన వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతాను. సంకీర్ణ ప్రభుత్వంలో నేను మంత్రిని’ అని చెప్పుకొచ్చారు.


జగన్ ఒక నిలకడ లేని మనిషి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అమరావతి తొందర్లోనే పూర్తి అవుతుందన్నారు. రాజధానిపై జగన్ మాట్లాడటం చూస్తే అవగాహనా లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కొన్ని చోట్ల మార్పు రావాల్సి ఉందని.. దానిపై కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదుపైనా చర్యలు తీసుకుంటున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 12:50 PM