Share News

ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:30 AM

టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, జులై 6: టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం దలైలామా కృషి ప్రశంసనీయమని కొనియాడారు.


చంద్రబాబు పోస్ట్..

‘శాంతి, కరుణ, మానవత్వానికి దలైలామా ప్రతీక. దశాబ్దాలుగా ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా. దయ, జ్ఞానం, అహింసను ఆచరించాలని దలైలామా సందేశం ఇచ్చారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం దలైలామా కృషి ప్రశంసనీయం. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలి. శాంతి, కరుణ వ్యాప్తి చేసే దలైలామా సేవలు చిరస్మరణీయం. దలైలామా తన మహోన్నత సేవలను మరింత కాలం కొనసాగించాలి’ అని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


బాబు జగ్జీవన్ రామ్‌కు సీఎం ఘన నివాళి

స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘సామాజిక న్యాయ సాధనకు, బడుగు బలహీన వర్గాల సాధికారతకు, సమాన అవకాశాలు కలిగిన సమసమాజ నిర్మాణానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్. దేశ వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి బలమైన పునాది వేసి, ఆహార భద్రత సాధనలో విశిష్ట పాత్ర పోషించిన దూరదృష్టి గల నాయకుడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తిదాయక సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 11:55 AM