ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ
ABN , Publish Date - Jul 06 , 2026 | 10:06 AM
దక్షిణ కొరియా పర్యటనలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు.
అమరావతి, జులై 6: దక్షిణ కొరియా పర్యటనలో ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో షూఆల్స్ పాదరక్షల యూనిట్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని షూఆల్స్‌కు మంత్రి ఆహ్వానం పలికారు. ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. మంత్రి లోకేశ్ విజ్ఞప్తిపై షూఆల్స్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ.. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. ఏపీలో రూ.300 కోట్లతో షూఆల్స్ యూనిట్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించనుంది.
సోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్‌తో భేటీ..

సోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాతో మంత్రి భేటీ అయ్యారు. శ్రీసిటీలో సోలమ్ యూనిట్ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ తయారీ విస్తరణకు మంత్రి ఆహ్వానించారు. శ్రీసిటీ ప్లాంట్ పనులు వేగవంతం చేస్తామని సోలమ్ సంస్థ పేర్కొంది. రూ.338 కోట్లతో శ్రీసిటీలో సోలమ్ ఈవీ ఛార్జర్ యూనిట్ నిర్మాణం జరగనుంది.
సాఫ్ట్-ఈపీఐ సీఈవోతో సమావేశం..

ఆపై సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్(Mr. Sung Min, Hwang), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోతో (Mr. In-sung, Cho) మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి ఐఐటీ సహకారంతో అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్‌కు ఆహ్వానం పలికారు. ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా సాఫ్ట్-ఈపీఐ సీఈవో తెలిపారు. కొరియా పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపైనా మంత్రి లోకేశ్ దృష్టి సారించారు.

ఇవి కూడా చదవండి...
ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు
కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి
Read Latest AP News And Telugu News