‘సర్ ’ పై నేడు సచివాలయంలో ప్రత్యేక శిబిరం
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:07 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు అమరావతి సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు.
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు అమరావతి సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. దీనిని సోమవారం ఉదయం 10.30 గంటలకు మూడవ బ్లాకులోని ఏపీ సచివాలయ సంఘం(అప్సా) హాల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తదితరులు పాల్గొననున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్‌లైన్‌లో సబ్‌మిషన్, కొత్త ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్, ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించనున్నారు.