Share News

ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు

ABN , Publish Date - Jul 06 , 2026 | 07:58 AM

బోటు ఇంజిన్ లోపంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా తీరానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు
AP fishermen Rescue

అమరావతి: బోటు ఇంజిన్ లోపంతో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మత్స్యకారులు తమ పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.


మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. త్వరలోనే వారి స్వగ్రామాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తోందని వెల్లడించారు.


కాగా, మత్స్యకారుల బోటుకు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అది సముద్రంలోనే నిలిచిపోయింది. అనంతరం పరిస్థితిని సంబంధిత అధికారులకు వీడియో ద్వారా వివరించారు. దీనిపై అప్రమత్తమైన అధికారులు వెంటనే ఒడిశా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం మత్స్యకారులు ఒడిశా తీరానికి సురక్షితంగా చేరుకున్నారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.


Also Read:

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 06 , 2026 | 08:18 AM