హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య..
ABN , Publish Date - Jul 06 , 2026 | 10:10 AM
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హత్యకు గల కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన కీలక ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also Read:
సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు
7,437 ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్!