Share News

సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు

ABN , Publish Date - Jul 06 , 2026 | 09:27 AM

తెలుగు సినిమా నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు అయింది. మరో నిర్మాత రజిత్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు
Venkat Aneesh Reddy

హైదరాబాద్, జులై 6: తెలుగు సినిమా నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు అయింది. మరో నిర్మాత రజిత్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని అనీస్ రెడ్డి తనను మోసం చేసినట్టు రజిత్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడి దగ్గరినుంచి అనీష్ రెడ్డికి 40 లక్షల రూపాయలు ఇప్పించానని ఆయన తెలిపారు. లోన్ క్లియర్ అవగానే డబ్బులు తిరిగి చెల్లిస్తానని తప్పుడు హామీలు ఇచ్చాడని పేర్కొన్నారు.


డబ్బులు ఇవ్వకుండా అనీష్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో రజిత్ రావు చెప్పుకొచ్చారు. తనను మోసం చేసి బెదిరింపులకు పాల్పడుతున్న అనీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రజిత్ రావు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనీష్ రెడ్డిపై చీటింగ్ కేసుతో పాటు క్రిమినల్ సెక్షన్లు నమోదు చేశారు. అనీష్ రెడ్డిపై బీఎన్ఎస్ 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి

దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే: వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్

ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో కష్టాలే!

Updated Date - Jul 06 , 2026 | 09:53 AM