ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో కష్టాలే!
ABN , Publish Date - Jul 06 , 2026 | 09:09 AM
వివాహం.. జీవితంలో అత్యంత కీలక ఘట్టం. మరి చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. ఏ లక్షణాలు ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో రూపం, ఆకర్షణ మాత్రమే కాకుండా వారి స్వభావం, విలువలు, ప్రవర్తన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నారు.
రూపాన్ని చూసి నిర్ణయం తీసుకోవద్దు
చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. బాహ్య సౌందర్యం శాశ్వతం కాదు. ఒక వ్యక్తి అసలు విలువ అతని మంచి స్వభావం, ఆలోచనా విధానం, నడవడికలో ఉంటుంది. అందుకే రూపం కంటే గుణగణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచిస్తారు.
కోపాన్ని అదుపు చేసుకోలేని వారు
ఎప్పుడూ కోపంగా ఉండే, చిన్న విషయానికే కఠినంగా మాట్లాడే వ్యక్తులతో జీవించడం కష్టంగా మారవచ్చని చాణక్యుడు చెబుతారు. అలాంటి స్వభావం కుటుంబంలో శాంతిని దెబ్బతీయవచ్చని ఆయన అభిప్రాయం.
డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చేవారు
వివాహ బంధం ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంపై నిలబడాలని చాణక్యుడు పేర్కొంటారు. కేవలం ధనం లేదా హోదా కోసం సంబంధాలను చూసే వ్యక్తులు కష్టకాలంలో అండగా నిలవకపోవచ్చని ఆయన హెచ్చరిస్తారు.
ఇతరులను గౌరవించని వారు
తల్లిదండ్రులు, పెద్దలు లేదా ఇతరులను గౌరవించని వ్యక్తి జీవిత భాగస్వామిని కూడా అదే విధంగా గౌరవించకపోవచ్చని చాణక్యుడు భావిస్తారు. కుటుంబ విలువలను గౌరవించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని సూచిస్తారు.
నిజాయితీ
ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, నైతిక విలువలను పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో వైవాహిక జీవితం సాఫీగా సాగడం కష్టమని చాణక్యుడు పేర్కొంటారు. నిజాయతీ, విశ్వాసం, మంచి ప్రవర్తన దాంపత్య జీవితానికి బలమైన పునాది అని ఆయన అభిప్రాయం.
Also Read:
పోగు చేయాల్సింది.. డబ్బు కాదు జ్ఞాపకాల్ని!