Share News

దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే: వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్

ABN , Publish Date - Jul 06 , 2026 | 09:16 AM

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు.

దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే: వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్
VHP Chief Alok Kumar

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ (VHP) అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు (Ram Temple donation row).


'ఈ వివాదాన్ని వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ లేదా కేంద్ర ప్రభుత్వానికి నేరుగా ముడిపెట్టడం సరికాదు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ట్రస్ట్‌దే. వీహెచ్‌పీ తరఫున ఎవరినీ ట్రస్ట్‌లో నియమించలేదు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వీహెచ్‌పీ సీనియర్ నాయకుడే అయినప్పటికీ, ఆయన ట్రస్ట్‌లో వీహెచ్‌పీ ప్రతినిధిగా లేరు. అయినా ఈ దోపిడీలో చంపత్‌రాయ్‌ ప్రేమయం ఉందని ఇప్పటివరకు బయటకు రాలేదు. దర్యాప్తు పూర్తికాకముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు' అని అలోక్ కుమార్ అన్నారు (VHP Alok Kumar).


ఈ వ్యవహారంలో వీహెచ్‌పీ మొదటి నుంచే నాలుగు ప్రధాన డిమాండ్లు చేసిందని అలోక్ కుమార్ వెల్లడించారు (Ram Mandir donation controversy). వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, సీనియర్ అధికారులతో దర్యాప్తు చేపట్టడం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ నిర్వహించడం, నాలుగు నుంచి ఐదు నెలల్లో కేసును పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని తాము మొదటి నుంచి కోరుతున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 06 , 2026 | 10:21 AM