Home » Dalai Lama
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా 91వ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దలైలామా అందించిన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మార్గదర్శకమని ప్రధాని మోదీ కొనియాడారు.
టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబధాలు ఉన్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది.
టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తన 90వ ఏట.. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక...
దలైలామాకు గ్రామీ అవార్డుపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పందించారు. దలైలామా పూర్తి ఆధ్యాత్మిక వ్యక్తి కాదని, మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని విమర్శించారు.
దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పది మంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది.
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఆదివారం ధర్మశాలలో వైభవంగా జరిగాయి.
PM Modi wishes Dalai Lama on his 90th birthday: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి మీరు ప్రతీక అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా వారసుడు ఎవరన్న చర్చ పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా స్పందించింది. మతపరమైన విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోదని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వెల్లడించారు.