దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:52 PM
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా 91వ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దలైలామా అందించిన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మార్గదర్శకమని ప్రధాని మోదీ కొనియాడారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా 91వ పుట్టిన రోజును పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దలైలామా అందించిన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మార్గదర్శకమని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచ శ్రేయస్సు పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రశంసనీయమన్నారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘పరమ పవిత్ర దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు. దలైలామా అందించిన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మార్గదర్శకం. ప్రపంచ శ్రేయస్సు పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రశంసనీయం. ఆయనకు ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం లభించాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు.
మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించనున్నారు. జులై 6వ తేదీ నుంచి జులై 11వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. దేశాధినేతలతో మోదీ భేటీ అవ్వనున్నారు. ఆర్థిక, వ్యూహాత్మక సహకారంపై చర్చలు జరపనున్నారు.
ఇవి కూడా చదవండి
వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో మోహన్‌లాల్ కీలక ప్రకటన
ధైర్యానికి శాశ్వత నిదర్శనం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళి..