వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో మోహన్‌లాల్ కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:40 PM
వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో నటుడు మోహన్‌లాల్ కీలక ప్రకటన చేశారు. కేరళ అటవీశాఖ క్షమాభిక్ష పథకం కింద తన వద్ద ఉన్న వన్యప్రాణి సంబంధిత వస్తువుల వివరాలను అధికారులకు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తన వద్ద ఉన్న వన్యప్రాణి సంబంధిత వస్తువులపై అధికారికంగా ప్రకటన చేశారు. కేరళ అటవీశాఖ ప్రకటించిన క్షమాభిక్ష పథకంలో భాగంగా తన వద్ద ఉన్న వస్తువుల వివరాలను వెల్లడించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏనుగు దంతాలతో తయారు చేసిన 13 విగ్రహాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల మోహన్‌లాల్‌పై వన్యప్రాణి సంబంధిత వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు.
వన్యప్రాణి సంబంధిత వస్తువులను తమ వద్ద కలిగి ఉన్నవారు వాటిని స్వచ్ఛందంగా ప్రకటించుకునేందుకు కేరళ అటవీశాఖ క్షమాభిక్ష పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రకటించిన వస్తువులను సంబంధిత నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
Also Read:
ధైర్యానికి శాశ్వత నిదర్శనం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళి..
వాస్తు ప్రకారం ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంచొచ్చా?