Share News

గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:24 PM

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా ఘటనలో మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.

గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
Minister Atchannaidu

అమరావతి, జులై 6: అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పడవ బోల్తా ఘటనలో మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై నేవీ, కోస్ట్ గార్డు అధికారులతో ఈరోజు(సోమవారం) ఉదయం సమావేశమై చర్చించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.


రెండో రోజూ ప్రత్యేక నౌక, రెస్క్యూ బోటు, హెలికాప్టర్‌తో నేవీ, కోస్ట్ గార్డు సంయుక్త గాలింపు కొనసాగుతోందని మంత్రికి అధికారులు తెలిపారు. కారి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు. మరోవైపు, కారి చిన్నను ఈరోజు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు కోస్ట్ గార్డు తీసుకెళ్లనుంది. గల్లంతైన వారిలో కారి గంగయ్య, అమర అప్పలరాజు, కారి సితోడు, మేడ చిన్న అమ్మోరు, కారి చిన్నయ్య, రాగుతు బండియ్యలు ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 12:46 PM