Share News

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి కొలమానం

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:23 AM

రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ.. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి కొలమానం
Adluri Lakshman Kumar

  • అంతర్జాతీయ ప్యానల్‌ చర్చలో మంత్రి అడ్లూరి

రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ.. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక వృద్ధి, పరిశ్రమలతోనే రాష్ట్ర ప్రగతిని అంచనా వేయకూడదని, పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య, వృద్ధుల గౌరవప్రదమైన జీవనం, బలహీన వర్గాలకు దక్కుతున్న సమానావకాశాలే సమగ్రాభివృద్ధికి అసలైన కొలమానమని పేర్కొన్నారు.


హైటెక్స్‌లో జరుగుతున్న ‘భారత్‌ సమ్మిట్‌-2026’లో భాగంగా ‘విద్య, సంక్షేమం, సాధికారత ద్వారా సామాజిక న్యాయం’ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ పానెల్‌ చర్చలో మంత్రి మాట్లాడారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో 105 నియోజకవర్గాల్లో సుమారు రూ.21వేల కోట్ల వ్యయంతో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల’ను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా 2.70 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందనుందని తెలిపారు. చర్చలో భాగంగా ప్యానెల్‌ సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. బాలల సంక్షేమం, అట్టడుగు వర్గాల విద్యపై మంత్రి వివరణలను సామాజిక కార్యకర్త శాంతాసిన్హా అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 05:23 AM