బీజేపీతో డీల్ ఎంతకు కుదిరిందో కేసీఆరే చెప్పాలి: అద్దంకి
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:51 AM
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించడం వెనుక బీజేపీతో చీకటి ఒప్పందం దాగి ఉందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు.
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించడం వెనుక బీజేపీతో చీకటి ఒప్పందం దాగి ఉందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య జరిగిన ఆ డీల్ రేటెంతో, ఎంతకు అమ్ముడుపోయారో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో అద్దంకి మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి చర్చలు లేకుండానే బీజేపీకి బీఆర్‌ఎస్ ప్రత్యక్షంగా మద్దతు ఇస్తోందని.. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకే ఈ ఎత్తుగడలకు తెరలేపాయన్నారు. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ప్రాతిపదిక లేదని, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేవలం ఉత్తరాది రాష్ట్రాల బలంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఏకపక్షంగా బీఆర్‌ఎస్ మద్దతు ఎలా ఇస్తుందని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News