Share News

బంగారు గణపయ్య

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:53 AM

హైదరాబాద్‌ బేగంబజార్‌లో 24 క్యారెట్ల బంగారం, 3 లక్షల 880 అమెరికా వజ్రాలతో రూపొందించిన ప్రత్యేక వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

బంగారు గణపయ్య
Gold Ganesha Idol

  • 24 క్యారెట్ల పసిడి, 3లక్షలకు పైగా వజ్రాలతో వినాయక విగ్రహం

  • హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో ఏర్పాటు

అఫ్జల్‌గంజ్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌, బేగంబజార్‌లోని ఓ మండపంలో భక్తులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం కళ్లు జిగేలుమనిపిస్తోంది. ఎందుకంటే అది సాధారణ విగ్రహం కాదు. 24 క్యారెట్ల బంగారం, 3 లక్షల 880 అమెరికా వజ్రాలతో తయారు చేయించిన బంగారు గణపయ్య ప్రతిమ మరి. బేగంబజార్‌ ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన అనిల్‌ అగర్వాల్‌, ఆధార్‌ అగర్వాల్‌, నిఖితేష్‌ అగర్వాల్‌ అనే అన్నదమ్ములు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. ఫీల్‌ఖానాలోని తమ దుకాణం ఏర్పాటు చేసిన మండపంలో ఈ విగ్రహాన్ని పెట్టారు. 3 అడుగుల ఎత్తు, 48 కిలోల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని ఎనిమిది మంది కళాకారులు అత్యంత సుందరంగా తయారు చేశారు. 11రోజుల పాటు ఈ గణనాథుడిని పూజిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
రావయ్యా గణపయ్యా..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 05:53 AM