Share News

భక్తిశ్రద్ధలతో గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:30 AM

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించుకోవా లని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు.

భక్తిశ్రద్ధలతో గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

వేములవాడ రూరల్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించుకోవా లని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. వేములవాడ పట్టణంలోని మహాదేవ్‌ ఫం క్షన్‌ హాల్‌లో వేములవాడ రూరల్‌ పోలీసులు గణేష్‌ మండపాల నిర్వాహకులు, ఉత్సవ క మిటీ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసు లు మాట్లాడుతూ గణేష్‌ విగ్రహాల ప్రతిష్ఠాప న నుంచి నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. వేములవాడ రూరల్‌ మండలంలోని మండపాల నిర్వాహకులు పోలీసు, విద్యుత్‌, ఫైర్‌ శాఖల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్‌ ద్వారా వివరాల ను నమోదు చేసుకుని పోలీసు వారికి సహక రించాలన్నారు. ఈ సమావేశంలో వేముల వాడ రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, ఫైర్‌ సిబ్బంది తదితర అధికారులు, మండల గణేష్‌ మండప నిర్వా హకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2026 | 12:30 AM