Share News

సైబర్‌ నేరగాళ్ల కట్టడికి.. 13 రాష్ట్రాల పోలీసుల ఉమ్మడి కార్యాచరణ

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:52 AM

దేశవ్యాప్తంగా సరిహద్దులు దాటి కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌ నేర ముఠాల ఆట కట్టించేందుకు 13 రాష్ట్రాల పోలీసులు చేతులు కలిపారు.

సైబర్‌ నేరగాళ్ల కట్టడికి.. 13 రాష్ట్రాల పోలీసుల ఉమ్మడి కార్యాచరణ
Hyderabad Cybercrime Meeting

  • ఐ4సీ, తెలంగాణ సీఎస్‌బీ సమన్వయంతో హైదరాబాద్‌లో సమావేశం

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సరిహద్దులు దాటి కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌ నేర ముఠాల ఆట కట్టించేందుకు 13 రాష్ట్రాల పోలీసులు చేతులు కలిపారు. సైబర్‌ నేరాలపై సమాచార మార్పిడి, దర్యాప్తులో సమన్వయం, నేరగాళ్లపై ఉమ్మడి చర్యలు చేపట్టడమే లక్ష్యంగా కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) సమన్వయంతో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీఎ్‌సబీ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జాయింట్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ టీం (జేసీసీటీ4) సమావేశం నిర్వహించింది.


తెలంగాణ, ఏపీతో పాటు 11 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు ప్రస్తుతం వ్యవస్థీకృత పరిశ్రమగా మారాయని, నేరం జరిగిన తర్వాత డబ్బు రికవరీ చేయడం కంటే అసలు నేరం జరుగకుండా అడ్డుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఒకే నెట్‌వర్క్‌తో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే, పోలీసు వ్యవస్థ మాత్రం రాష్ట్రాల అధికార పరిధులకే పరిమితమవుతోందని తెలంగాణ సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ అన్నారు. సైబర్‌ నేరగాళ్ల స్కామ్‌ కేంద్రాలు ఆగ్నేయాసియా నుంచి ఆఫ్రికా, శ్రీలంక తదితర దేశాలకు విస్తరిస్తున్నాయని ఐ4సీ సీఈవో రాజేశ్‌ కుమార్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:52 AM