Share News

ఐఫోన్ పేరుతో భారీ స్కామ్.. వివరాలివే..

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:46 PM

నగరంలో నకిలీ ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తుల విక్రయాల గుట్టురట్టయింది. ఒరిజినల్ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ అంటూ నకిలీ వస్తువులను ఓ ముఠా విక్రయిస్తోంది.

ఐఫోన్ పేరుతో భారీ స్కామ్.. వివరాలివే..
పోలీసులు అదుపులో నిందితుడు అల్తమాష్

హైదరాబాద్‌, నవంబర్ 7: నగరంలో నకిలీ ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తుల విక్రయాల గుట్టురట్టయింది. ఒరిజినల్ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ అంటూ నకిలీ వస్తువులను ఓ ముఠా విక్రయిస్తోంది. అమాయక ప్రజలను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతోంది. పక్కా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు తనిఖీ నిర్వహించగా అసలు బండారం బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఆవేష్ ఖాన్, అల్తమాష్ ఈ నకిలీ ఐఫోన్లను అమాయక ప్రజలకు అంటగడుతున్నారని పోలీసులు గుర్తించారు.


హైదరాబాద్‌లోని మలక్‌పేట్ సైద్‌నగర్‌లో నివాసముంటున్న నిందితుడు అల్తమాష్(26)ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 2 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి నకిలీది. అలాగే అతడి దగ్గర నుంచి నాలుగు నకిలీ ఆపిల్ స్మార్ట్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అల్తమాష్‌ను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. కాగా ప్రధాన నిందితుడు ఆవేష్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క

రేవంత్.. కమీషన్ల కోసమే మూడేళ్లు సెలవు తీసుకోలేదా?: మాజీ మంత్రి హరీశ్ రావు

Updated Date - Nov 07 , 2026 | 08:57 PM