Share News

భరోసా సెంటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీవీ ఆనంద్

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:44 PM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భరోసా సెంటర్ ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం గచ్చిబౌలిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి భరోసా సెంటర్‌ను డీజీపీ ప్రారంభించారు.

భరోసా సెంటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీవీ ఆనంద్

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భరోసా సెంటర్ ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం గచ్చిబౌలిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి భరోసా సెంటర్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్ భవన నిర్మాణం పూర్తి కావడంలో రహేజా గ్రూప్ డైరెక్టర్ శ్రవణ్ కృషి అభినందనీయమని చెప్పారు. ఆ భవన నిర్మాణం కోసం ఆయన రూ.3.5 కోట్ల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. దేశంలోనే ఇలాంటి సమగ్ర సేవల కేంద్రం మరెక్కడా లేదన్నారు. మహిళలకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే గొడుగు కింద పనిచేసేలా భరోసా సెంటర్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఒకేచోట మెడికల్ సేవలు, కౌన్సెలింగ్, న్యాయ సలహాలు, పోలీసుల దర్యాప్తు విభాగాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దేశానికి, రాష్ట్రానికి భరోసా కేంద్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.


ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త ఆలోచనలు స్వాగతిస్తాం

వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్త ఆలోచనలు, సూచనలు వస్తే తప్పకుండా స్వాగతిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు వన్‌వే విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రజలు కూడా ఈ విధానాన్ని అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక ప్రైవేట్ ఐటీ సంస్థల సహకారంతో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి వ్యవస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు. సెక్యూరిటీ కౌన్సిల్ పోలీసులతో కలిసి పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు.


మహిళల భద్రత కోసం షీ టీమ్స్

గతంలో తాను పనిచేసిన సమయంలో రెండు అత్యాచార ఘటనలు జరిగాయని డీజీపీ తెలిపారు. ఆ ఘటనలు మహిళల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ వ్యవస్థను ప్రవేశపెట్టామని తెలిపారు. అలాగే మంచిరేవులలో యంగ్ ఇండియా స్కూల్‌ను ప్రారంభించామని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల సహకారంతో స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కీలకంగా మారుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాయిలర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Updated Date - Nov 10 , 2026 | 06:44 PM