బాయిలర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:09 PM
రాష్ట్రంలో బాయిలర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాయిలర్ల సర్టిఫికెట్ల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్10: రాష్ట్రంలో బాయిలర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాయిలర్ల సర్టిఫికెట్ల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 465 జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది. దీంతో ఇంధన వినియోగాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.
100 టన్నులు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బాయిలర్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యుత్ కేంద్రాలు, చమురు, గ్యాస్ పరిశ్రమలకు ఊరట కలిగిస్తుంది. అలాగే పెట్రోలియం రిఫైనరీలు, పెట్రోకెమికల్‌తోపాటు ఎరువుల పరిశ్రమలకు వెసులుబాటు కల్పిస్తుంది. 2026, నవంబర్ 30వ తేదీ వరకు మాత్రమే గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ అమలు కానుంది. ఆరు నెలల్లో సర్టిఫికెట్ గడువు ముగిసే బాయిలర్లకు మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. భద్రతా ప్రమాణాలు, సాంకేతిక తనిఖీలు మాత్రం తప్పనిసరి అని జారీ చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
స్థానిక ఎన్నికల విజయంతో విర్రవీగొద్దు.. 2029 ఎన్నికలే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Read Latest TG Govt And Telugu News