Share News

సిద్దిపేట అభివృద్ధి కోసం రూ.550 కోట్లు: సీఎం రేవంత్

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:35 PM

సిద్దిపేటలో సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించారు. అలాగే, రూ.451.13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

సిద్దిపేట అభివృద్ధి కోసం రూ.550 కోట్లు: సీఎం రేవంత్

ఇంటర్నెట్ డెస్క్: సిద్దిపేటలో సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించారు. అలాగే, రూ.451.13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ బీమా పథకాన్ని కూడా ప్రారంభించారు. దుబ్బాక, సిద్దిపేటలో రూ.200 కోట్లతో నిర్మించనున్నయంగ్ ఇండియా స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే 6 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకూ భూమిపూజ చేశారు. 14 విద్యుత్ సబ్ స్టేషన్లను కూడా సీఎం ప్రారంభించారు. సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.


సిద్దిపేట అభివృద్ధి కోసం రూ.550 కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. ఇవాళ్టి నుంచి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని తమ కార్యకర్తలు నిరూపించారని పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకమైన మదన్‌మోహన్‌ను అందరం స్మరించుకోవాలన్నారు. మదన్‌మోహన్‌ పేరు లేకుండా చేయాలని మాజీ సీఎం కేసీఆర్ కుట్రపన్నారని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి మదన్‌మోహన్‌ పేరు పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. మోసమే కేసీఆర్‌ పెట్టుబడి అని విమర్శించారు. 2004లో హరీష్‌రావు వార్డు మెంబర్‌ కూడా కాదన్నారు. ‘గజ్వేల్‌ గడ్డపై కాలు పెడతా.. కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తానని అప్పుడు చెప్పా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ పాలన తెచ్చాం. సిద్దిపేట నుంచి మాట ఇస్తున్నా. 2029లో రెండోసారి కూడా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం’ అని రేవంత్ పేర్కొన్నారు. కాగా.. ఈ సభకు భారీగా జనం హాజరయ్యారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో సీఎం కరచాలనం చేస్తూ శ్రేణులను ఉత్సాహపరిచారు.


సిద్దిపేట పోరాటాల అడ్డా: మహేష్ గౌడ్‌

సిద్దిపేట పోరాటాల అడ్డా అని టీపీసీసీ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు మహేష్ గౌడ్ అన్నారు. కొంతమంది ప్రాజెక్టుల పేరిట సిద్దిపేటను దోచుకున్నారని బీఆర్ఎస్‌ను ఆయన విమర్శించారు. త్వరలో సిద్దిపేటలో బీఆర్ఎస్ కోటలు బద్దలు కాబోతున్నాయని అన్నారు. సిరిసిల్లలోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర ప్రారంభమైందన్నారు. ఇకపై ఒకే కుటుంబం ఆధిపత్యం నడవదని అన్నారు. అన్ని వర్గాలకూ కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 07:35 PM