స్టార్టప్‌లకు కేంద్రంగా ‘టీ-హబ్’ ఉండాలి.. సీఎస్‌కు సీఎం రేవంత్ ఆదేశాలు
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:29 PM
టీ-హబ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ-హబ్ కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: టీ-హబ్(T–Hub) లక్ష్యాలను నీరుగార్చేలా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందని, అద్దె భవనాల్లో (Rented building) ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ-హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఖండించారు. టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయం గురించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు.
టీ-హబ్‌ను ప్రత్యేక స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే వెంటనే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
జగన్ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత
Read Latest Telangana News and National News