మెతుకు ఆనంద్‌కు స్పీకర్ లీగల్ నోటీసు
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:24 AM
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ శుక్రవారం లీగల్ నోటీసు పంపారు.
హైదరాబాద్/వికారాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ శుక్రవారం లీగల్ నోటీసు పంపారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసి మానసిక క్షోభకు గురి చేసినందుకుగాను రూ.10 కోట్లు నష్ట పరిహారం చెల్లించడంతోపాటు వారంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చే శారు. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంలో తాను రూ.వందల కోట్లు లంచంగా తీసుకున్నానని మీడియా సమావేశంలో ఆనంద్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఇది రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిని అవమానించడమేనని పేర్కొన్నారు. మరో సమావేశంలోనూ తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడారన్నారు. అలాగే తాను అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుం చి లంచాలు తీసుకున్నానంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారని స్పీకర్ పేర్కొన్నారు.