Share News

డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 08:37 AM

సికింద్రాబాద్ ఏరియాలో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు విధించినట్లు మల్కాజిగిరి డీసీపీ సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: పరేడ్‌ గ్రౌండ్స్‌(Parade Grounds) పరిసర ప్రాంతాల్లో ఈనెల 26న రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్‌ కంట్రోల్డ్‌ మైక్రో లైట్‌ వాహనాల ఎగరవేతపై నిషేధం విధిస్తూ శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ సీహెచ్‌ శ్రీధర్‌(Malkajgiri DCP CH Sridhar) ఉత్తర్వులు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బేగంపేట, మార్కెట్‌, మారేడ్‌పల్లి పోలీస్టేషన్‌(Maredpally Police Station)ల పరిధుల్లో ఈ ఆంక్షలుంటాయన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించి డ్రోన్‌లు ఎగరవేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


city4.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి

మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..

జగన్‌ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2026 | 08:37 AM