‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:51 PM
నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు ‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’ దేవస్థానములో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
నల్లగొండ : నార్కెట్‌పల్లి(Narketpally) మండలంలోని చెర్వుగట్టు(Chervugattu) ‘శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి’ దేవస్థానములో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా (Brahmotsavalu) గణపతి పూజ, పుణ్యహవాచనం, అఖండ దీప స్థాపనతో ఉత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. గణపతి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జాతరకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్న ప్రసాద వితరణ, మౌలిక వసతులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి.